శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 3 జులై 2020 (23:06 IST)

లాక్ డౌన్‌లతో లాభం లేదు, కరోనావైరస్‌కి టీకా అక్కర్లేదు.. ఎవరు?

చాలామందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ అవసరం లేదని, కరోనావైరస్ వల్ల కలిగే శ్వాసకోశ అనారోగ్యానికి ఆ టీకీ పెద్దగా పనిచేయదనీ, పరీక్షలు చేయనివారిలో చాలామందికి ఈ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉందని యుకెకు చెందిన ఎపిడెమియాలజిస్ట్ ప్రొఫెసర్ సునేత్రా గుప్తా చెపుతున్నారు.
 
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సైద్ధాంతిక ఎపిడెమియాలజీని బోధిస్తున్న గుప్తా, మహమ్మారి వ్యాప్తిని తనిఖీ చేయడానికి దీర్ఘకాలిక చర్యగా లాక్డౌన్లను వ్యతిరేకించారు. అంతేకాదు, ఆమె ఏమంటున్నారంటే... టీకా దొరికినప్పుడు, అది హాని కలిగించే విభాగాలకు మాత్రమే ఇవ్వబడుతుందనీ, 65 ఏళ్లు పైబడిన వారు, మరీ అనారోగ్యంతో వున్నవారికి ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందంటున్నారు.
 
"టీకా, అది ఉనికిలోకి వచ్చినప్పుడు, బలహీనంగా ఉన్నవారికి మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడుతుంది, మనలో చాలామంది కరోనావైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు." అని ఆమె కుండబద్ధలు కొట్టినట్లు చెపుతున్నారు. ఎందుకంటే కరోనా మహమ్మారి సహజంగానే చనిపోతుంది. ఇది వచ్చినా అది కూడా ఓ ఇన్ఫ్లుయెంజా వంటిదిలా సాధారణమైన జ్వరంగా మారుతుందని ఆమె అంటున్నారు. ఈ వైరస్ మరీ బలహీనంగా వున్నవారిని, వ్యాధినిరోధక శక్తి తక్కువ వున్నవారికే ప్రాణాంతకమవుతుందని అంటున్నారు.
 
వైరస్ వ్యాప్తిని కలిగి ఉండటానికి లాక్‌డౌన్లు సహాయపడగా, అవి దీర్ఘకాలిక చర్యగా పనిచేయవంటున్నారు. లాక్డౌన్ విజయవంతం అయిన దేశాలలో కూడా, కరోనావైరస్ కేసులు ఆ తర్వాత నుంచి పుంజుకోవడం కనిపిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. భారతదేశంలో కూడా, లాక్డౌన్ పరిమితులను సడలించిన తరువాత కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. జూలై 2న ఈ సంఖ్య ఆరు లక్షలు దాటింది.