సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: శుక్రవారం, 3 జులై 2020 (14:19 IST)

కరోనావైరస్ నిర్థారణ కోసం ఐ మాస్క్ బస్సులు, విజయవాడలో ప్రారంభం

దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కరోనా నిర్థారణ పరీక్షలో ముందున్న ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసేందుకు ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐ-మాస్క్ బస్సుల్లో కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేవలం ఒక్క విజయవాడ లోనే 8 బస్సులను ఏర్పాటు చేసింది.
 
అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు పరచాలనుకుంటున్నట్లు తెలిపారు. కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా నిర్దారణ పరీక్షలను తీవ్రపరచింది.
 
విజయవాడలో 8 చోట్ల ఐ మాస్క్ బస్సులతో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నది. విజయవాడలో రోజుకు రెండు వేలమందికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, చికిత్సతో కరోనా వ్యాధి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది.