భారత్‌లో కరోనా కరాళనృత్యం.. రికార్డు స్థాయిలో 20,903 కేసులు
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 20,903 కరోనా కేసులు నమోదయ్యాయి.
అలాగే కరోనా కారణంగా 379 మంది మరణించారు. దీంతో భారత్‌లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,544కి చేరుకోగా మొత్తం మరణాల సంఖ్య 18,213గా ఉంది. ఇప్పటివరకు మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల్లో 2,27,439 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 3,79,891 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇకపోతే, దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. వైరస్ విజృంభణ మొదలైన తొలి రోజు నుంచి రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ ఇప్పుడిప్పుడే కనుమరుగయ్యే పరిస్థితి కనిపించటం లేదు. అందువల్ల వైరస్ భారీన పడకుండా ఉండాలంటే భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.