సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 జులై 2020 (12:28 IST)

కరోనాకు కొత్త లక్షణాలు వచ్చాయ్.. వాంతులొస్తే జాగ్రత్త..!

కరోనాకు కొత్త లక్షణాలు వచ్చాయ్.. అందుకే చాలా జాగ్రత్తగా వుండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా లక్షణాలు రోజు రోజుకు మారుతూనే వున్నాయి. సాధారణంగా దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలుంటే వాటిని కరోనాగా గుర్తించేవారు. ఆ తరువాత అందులో అనేక కొత్త లక్షణాలు వచ్చి చేరాయి. 
 
కరోనా సోకిన రోగుల్లో ఇప్పుడు మరికొన్ని కొత్త లక్షణాలను గుర్తించారు. అవే వికారం, వాంతులు, ఒళ్ళు నొప్పులు. కరోనా సోకిన రోగులకు వికారంగా ఉండటం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో పాటు చాలామందికి వాంతులు అవుతున్నాయి. మోకాళ్ళ నుంచి కింది భాగంలో నొప్పులు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. 
 
ఇక మరికొంత మందిలో ఈ వాంతులతో పాటుగా డయేరియా లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కొంతమందిలో షుగర్ లెవల్స్ తక్కువగా ఉండటం కూడా కరోనా లక్షణంగా గుర్తించినట్టు కరోనా టాస్క్ ఫోర్స్ సభ్యులు చెప్తున్నారు. ఇలాంటి వారికి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. 
 
దురద, దద్దుర్లు వంటివి కనిపిస్తున్నాయని.. కరోనా వైరస్ రూపాంతరం చెందుతుండటం వలన లక్షణాలు కూడా మారుతున్నాయని వైద్యులు చెప్తున్నారు.