మీకు బస్సు ఎక్కితే వాంతులా ఐతే ఇలా చేయండి.

vomit during pregnency
Last Modified సోమవారం, 23 సెప్టెంబరు 2019 (10:12 IST)
చాలామందికి బస్సు ప్రయాణం పడదు. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, కడుపులో తిప్పినట్లుగా ఉంటుంది. దాని ఫలితంగా వాంతులు అవుతుంటాయి. ఎక్కువగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలా చాలామందికి వాహనాల ప్రయాణం సమయంలో వాంతులు అవుతుంటాయి. అలాంటి వారు ప్రయాణానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య రాదంటున్నారు వైద్యులు.

చిన్న అల్లం ముక్కను బుగ్గ లోపల పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం చాలా తక్కువ. అలాగే అల్లంలో కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్ వంటివి మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. వక్కపొడిని చప్పరించినా వాంతుల నుంచి బయట పడవచ్చు.

నిమ్మకాయను కొద్దికొద్దిగా నలుపుతూ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీలిస్తే కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. లవంగాలు, సోంపు వంటివి దవడలో పెట్టుకుని చప్పరించినా కూడా వాంతులు రాకుండా వుంటాయి. వాంతులు ఎక్కువగా వచ్చేవారు కారు, బస్సు ఎక్కినప్పుడు ముందు సీట్లో కూర్చుని పరిసరాలను గమనిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు.దీనిపై మరింత చదవండి :