1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. Prasar Bharati Recruitment 2020 for Content Executive

ప్రసార భారతి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఢిల్లీలో ఖాళీల భర్తీ

Prasar Bharati Recruitment 2020
ప్రసార భారతి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంటెంట్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. సోషల్ మీడియా కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం ఏడు ఖాళీలున్నాయి. 
 
న్యూఢిల్లీలో ఈ ఖాళీలను భర్తీచేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 20 చివరి తేదీ. దరఖాస్తుల్ని పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రసార భారతి అధికారిక వెబ్‌సైట్ తెలుసుకునే వీలుంది. 
 
మొత్తం కంటెంట్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు- 7
వేతనం- రూ.20,000
విద్యార్హత- పీజీ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ జర్నలిజం. 
జర్నలిజంలో ఏడాది అనుభవం తప్పనిసరి. 
హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సామర్థ్యం ఉండాలి.
వయస్సు- 30 ఏళ్లు
 
దరఖాస్తులు పంపాల్సిన చిరుమానా:
డిప్యూటీ డైరక్టర్ (హెచ్ఆర్) 
దూరదర్శన్ న్యూస్ 
రూమ్ నెం.413,
దూరదర్శన్ భవన్, 
టవర్-బి, కాపర్ నికస్  మర్గ్, 
న్యూఢిల్లీ -110001.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఏకాంతం కోసం అడవులకు వెళ్తే.. పోలీసునని చెప్పి.. మహిళపై..?