1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. New academic year from August-September

సెప్టెంబరు 15 నుంచి కొత్త విద్యా సంవత్సరం

New Academic Year
దేశంలో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబరు 15వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పేర్కొంది. దేశవ్యాప్తంగా వృత్తి విద్య, సాంకేతిక విద్యాసంస్థల విద్యా సంవత్సరం ఈ ఏడాది సెప్టెంబరు 15 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. 
 
ఈ మేరకు సవరించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఫస్టియర్‌లో చేరే విద్యార్థులకు సెప్టెంబరు 1 నుంచి, ఇతర విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఏఐసీటీఈ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ షెడ్యూల్‌ను సవరించి కొత్త అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.
 
ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబరు 15 నుంచి తరగతులు ప్రారంభించాలని పేర్కొంది. మిగతా విద్యార్థులకు మాత్రం ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభించాలని సూచించింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థ.... 13 జిల్లాలు ముగ్గురికి పంచేశారు: దేవినేని