ఆగస్టు వరకు రైళ్ల రాకపోకలు లేనట్టే.. రీఫండ్ చేయనున్న రైల్వేశాఖ
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలవుతోంది. దీంతో రైల్వే శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుని దేశ వ్యాప్తంగా రైళ్లను నిలిపివేసింది. ఈ రైళ్లలో టిక్కెట్లు రిజర్వు చేసుకున్న ప్రయాణికులందరికీ పూర్తి మొత్తాన్ని రీఫండ్ చేసింది.
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆగస్టు నెల 15వ తేదీ వరకు సాధారణ రైళ్ళ రాకపోకలు పునరుద్ధరించే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో అప్పటివరకు రిజర్వేషన్ చేసుకున్న టిక్కెట్ల సొమ్మును తిరిగి చెల్లించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా కేవలం 230 మెయిల్స్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను మాత్రమే నడుపుతోంది.