బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 19 జూన్ 2020 (14:33 IST)

నిహారిక కొణిదెల - ఆగస్టులో నిశ్చితార్థం - ఫిబ్రవరిలో పెళ్లి? (video)

నిహారిక-చైతన్య
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పెళ్లి సందడి త్వరలో ప్రారంభం కానుంది. అవును... మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి కుదిరింది. గత కొన్ని రోజులుగా నిహారిక పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ యూ ట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు నిహారిక పెళ్లి గురించి స్పందిస్తూ... సంబంధాలు చూస్తున్నాం. త్వరలోనే పెళ్లి చేసేస్తాం అన్నారు. 
ఆ తర్వాత వరుణ్ తేజ్ పెళ్లి కూడా చేసేస్తాం అని చెప్పారు. ఇదిలా ఉంటే.. నిన్నటి నుంచి నిహారిక పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఇది నిజమేనా కాదా అనుకున్నారు. అయితే.. నిహారిక తనకు కాబోయే భర్త ఫోటోతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వార్త వాస్తవమే అని తెలిసింది.
వరుడు పేరు వెంకట చైతన్య జొన్నలగడ్డ. తండ్రి గుంటూరు జిల్లాలో ఉన్నతస్థాయిలో వున్న పోలీసు అధికారి అంటున్నారు. నిహారిక నిశ్చితార్థం ఆగస్టులో వుంటుందనీ, పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అని వార్తలు వస్తున్నాయి. నిహారిక తండ్రి నాగబాబు దీనిపై క్లారిటీ ఇచ్చేదాకా వెయిట్ అండ్ సీ.