శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 18 జూన్ 2020 (19:19 IST)

చిరు ఇంట్లో పెళ్లి భాజాలు.. పెళ్లి కూతురు నిహారిక, ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు..?

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పెళ్లి సందడి త్వరలో ప్రారంభం కానుంది. అవును...మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి కుదిరింది. గత కొన్ని రోజులుగా నిహారిక పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు నిహారిక పెళ్లి గురించి స్పందిస్తూ... సంబంధాలు చూస్తున్నాం. త్వరలోనే పెళ్లి చేసేస్తాం అన్నారు. 
 
ఆ తర్వాత వరుణ్ తేజ్ పెళ్లి కూడా చేసేస్తాం అని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం నుంచి నిహారిక పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఇది నిజమేనా కాదా అనుకున్నారు. అయితే.. నిహారిక తనకు కాబోయే భర్త ఫోటోతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వార్త వాస్తవమే అని తెలిసింది.
 
అయితే... వరుడు ఎవరో కనపడకుండా ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిశ్ఛాతార్థం ఈరోజు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిందని తెలిసింది. అతి ముఖ్యమైన ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఈ వేడుక జరిగిందని సమాచారం.
 
రేపు శుక్రవారం నిహారిక పెళ్లి గురించి నాగబాబు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. గుంటూరు లేదా చీరాలకు సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసర్ కొడుకుతో నిహారిక పెళ్లి ఫిక్స్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. మరి.. మెగా డాటర్‌ను పెళ్లి చేసుకోబోతున్న ఆ వరుడు ఎవరో రేపు తెలుస్తుంది.