మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (19:19 IST)

నిహారిక.. మిస్.. కాదు.. మిసెస్ కానుందా? ఫస్ట్ ఫోటో వచ్చేసింది..!

Niharika
టాలీవుడ్‌లో హీరోల వివాహాలు వరుసగా జరిగిపోతున్నాయి. ప్రస్తుతం హీరోయిన్లు వంతు వచ్చింది. త్వరలో మెగా కుటుంబంలో పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల అతి త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని సమాచారం. ఓ వ్యాపారవేత్తతో ఆమె వివాహం నిశ్చయమైందని, ఆగస్టులో వీరి పెళ్లి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. 
 
నాగశౌర్య కథానాయకుడిగా తెరకెక్కిన 'ఒక మనసు' సినిమాతో నిహారిక కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యారు. 2016లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. అనంతరం ఆమె హ్యాపీ వెడ్డింగ్‌, సూర్యకాంతం చిత్రాల్లో కథానాయికగా మెప్పించారు. ఇటీవల చిరంజీవి నటించిన 'సైరా' చిత్రంలో నిహారిక అతిథి పాత్రలో కనిపించారు.
 
ఇదిలా ఉంటే.. నిహారిక పెట్టిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆమె స్టార్‌బక్స్‌ కాఫీ కప్పు ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. అయితే ఆ కప్పుపై మిస్‌.నిహా (మిస్‌ని కొట్టివేసి) మిసెస్‌..? అని రాసి ఉంది. అయితే నిహారిక పెట్టిన పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. 'నిహారిక.. మీకు పెళ్లి ఫిక్స్‌ అయ్యిందా?, త్వరలో మీరు పెళ్లి చేసుకోనున్నారా? వరుడు ఎవరు?' అని కామెంట్లు చేస్తున్నారు.  
Niharika
 
మరోవైపు పెళ్లి విషయంపై మెగా కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే నిహారిక పెళ్లి గుంటూరు అబ్బాయితో ఫిక్స్ అయ్యిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. వరుడి తండ్రి ప్రభుత్వ అధికారి అని తెలిసింది. కరోనా ఇబ్బందులు తొలగిన తర్వాత వీరి వివాహం ఉంటుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అలాగే నిహారిక తన బాయ్‌ఫ్రెండ్‌తో తీసిన ఫోటో కూడా సోషల్ మీడియాలోకి ఎక్కింది. ఈ ఫోటోలో వున్న వ్యక్తినే నిహారిక వివాహం చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఫోటోను మీరూ ఓ లుక్కేయండి.. 



Niharika