శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 29 మే 2020 (21:27 IST)

మెగాస్టార్ ఆచార్య షూటింగ్ స్టార్ట్ అయ్యే రోజుపై క్లారిటీ

ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి... ఇలా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్న మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాని నిర్మిస్తుంది.
 
ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తుంటే... కరోనా వచ్చి షూటింగ్స్‌కి బ్రేక్ వేసింది. దీంతో మెగా అభిమానులు ఆచార్య అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
 ఇటీవల సినీ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చలు జరపడం... షూటింగ్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని అడగడం తెలిసిందే.
 
ఈ నేపధ్యంలో ఆచార్య సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు అని అభిమానులు ఆరా తీస్తున్నారు. తాజా వార్త ఏంటంటే.. ఆచార్య షూటింగ్‌తోనే షూటింగ్స్ మొదలు కానున్నట్టు తెలిసింది. ఈ చిత్రం జూన్ 15 నుంచి మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఆచార్య షూటింగ్ గురించి అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.