శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 12 మే 2020 (21:04 IST)

విజయ్ ఫైటర్ ఫ్లాన్ మార్చిన పూరి, ఇంతకీ ఏంటా ప్లాన్?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఫైటర్ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటా అనన్య పాండే నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ముంబాయిలో 40 రోజులు షూటింగ్ జరుపుకుంది. తర్వాత షెడ్యూల్ కూడా ముంబాయిలో ప్లాన్ చేసారు కానీ.. కరోనా వలన బ్రేక్ పడింది. 
 
అయితే.. ముంబాయిలో కరోనా విస్తృతంగా వ్యాపిస్తుండడంతో పూరి ఆలోచనలో పడ్డాడని తెలిసింది. విషయం ఏంటంటే... దేశంలో ముంబాయిలో ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయి. రోజురోజుకు అక్కడ కేసులు పెరుగుతుండడంతో ఇప్పట్లో అక్కడ షూటింగ్‌లకు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుచేత పూరి షూటింగ్‌ను ముంబాయి నుంచి హైదరాబాద్‌కి షిప్ట్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. 
 
హైదరాబాద్‌లో జూన్ లేదా జులైలో షూటింగ్ కి పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అందుచేత ముంబాయిలో ఎక్కడైతే షూటింగ్ చేయాలనుకున్నారో ఆ లోకేషన్‌ని హైదరాబాద్‌లో సెట్స్ రూపంలో వేసి షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట పూరి. 
 
ఈ సినిమాని అక్టోబర్‌లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. అనుకున్న ప్రకారం షూటింగ్ జరగకపోవడం వలన వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.