సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (14:59 IST)

వరల్డ్ ఫేమస్ లవర్‌తో నో యూజ్.. ''ఫైటర్'' మెప్పిస్తాడా? అనన్య పాండేనే హీరోయిన్

Fighter
వరల్డ్ ఫేమస్ లవర్‌తో అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫైటర్ సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నాడు. ఫైటర్ పైనే విజయ్ తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో పాటు హిందీలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దీంతో విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేయనున్నాడు. 
 
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్‌ను తీసుకోవాలనుకున్నారు. కానీ ఫైనల్‌గా మాత్రం ఈ సినిమాలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో పరిచయమైన అనన్య పాండేను కథానాయికగా తీసుకున్నారు. 
 
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ధ్రువీకరిస్తూ.. విజయ్ దేవరకొండతో పాటు పూరీ జగన్నాథ్, ఛార్మిలతో కలిసి ఉన్న అనన్యా పాండే ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా అయినా విజయ్ దేవరకొండకు హిట్‌ ఇవ్వాలని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు.