సంబంధిత వార్తలు
- తెదేపాను వీడాలంటూ ఒత్తిడి.. అందుకే మా బస్సులు సీజ్ : జేసీ దివాకర్
- శ్మశానాలకు మీ పార్టీ రంగులు వేయడం పూర్తయిందా జగన్ గారూ... : నారా లోకేశ్
- లక్ష్మీ పార్వతికి కీలక పదవి.... రేపు షకీలాకు కూడా ఇస్తారేమో?
- నెల రోజులు సెలవుపై వెళ్లిపోయిన ఎల్వీ సుబ్రహ్మణ్యం
- ఎల్వీ బదిలీ విధానంపై కేంద్రం కన్నెర్ర... నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరణ
రూపాయి జీతగాని ఇంటి సొబగులకు రూ.15 కోట్లా?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నెలకు కేవలం ఒక్కటంటే ఒక్క రూపాయి మాత్రమే వేతనం తీసుకుంటున్నారు. కానీ, ఆయన ఇంటి మరమ్మతుల కోసం కోట్లాది రూపాయల మేరకు ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు. తాజాగా మరో 15 కోట్ల వ్యయంతో ఇంటికి మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఈ నిధులను కూడా ప్రభుత్వం కేటాయించింది.
దీనిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. '‘రూపాయి జీతం మాత్రమే తీసుకొంటున్నానని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఇంటి సోకులకు ఐదు నెలల్లో రూ.15 కోట్లు ప్రజా ధనం ఖర్చు చేశారు' అని గుర్తుచేశారు.
'భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. విష జ్వరాలతో ప్రజలు చనిపోయినా ఫర్వాలేదు. దోమల నివారణకు ప్రజా ధనం వృథా చేయబోమని వైసీపీ నేతలే సెలవిచ్చారు. మరి ముఖ్యమంత్రి ఇంటి సోకులకు రూ.15 కోట్లు ఎలా ఖర్చు చేశారో చెప్పగలరా!' అని లోకేశ్ సూటిగా చెప్పారు.
