శ్మశానాలకు మీ పార్టీ రంగులు వేయడం పూర్తయిందా జగన్ గారూ... : నారా లోకేశ్

nara lokesh
ఠాగూర్| Last Updated: గురువారం, 7 నవంబరు 2019 (11:37 IST)
ఏపీలోని వైకాపా ప్రభుత్వంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, విమర్శలు గుప్పించారు. అన్ని భవనాలకు పార్టీ రంగులు వేసుకుంటున్నారని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లకు కూడా వైసీపీ రంగులు వెయ్యడం ప్రారంభించాలంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు.

ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 'శ్మశానాలకు, మరుగుదొడ్లకు మీ పార్టీ రంగులు పూసుకునే కార్యక్రమం పూర్తయ్యింది కదా జగన్‌గారు. ఇక ఆలస్యం ఎందుకు పోలీస్ స్టేషన్లకు కూడా వైకాపా రంగులు వెయ్యడం ప్రారంభించండి' అంటూ ట్వీట్ చేశారు.

'శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులతో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమకేసులు పెట్టిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలపై ఏకంగా పోలీసులతోనే దాడులు చేయిస్తున్నారు. తిరుచానూరులో టీడీపీ కార్యకర్త హేమంత్‌పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను' అని నారా లోకేశ్ మరో ట్వీట్ చేశారు.

'ముఖ్యమంత్రి జగన్ తన ఫ్యాక్షన్ కోరికలను పోలీసుల ద్వారా తీర్చుకుందామనే సరికొత్త పంథా ఎంచుకున్నారు. ఇకపై ఉపేక్షించేది లేదు. అక్రమ కేసులు పెడుతున్న అధికారుల పై ప్రైవేట్ కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కించే న్యాయ పోరాటం ప్రారంభించబోతున్నాం' అని నారా లోకేశ్ హెచ్చరించారు.దీనిపై మరింత చదవండి :