శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: సోమవారం, 4 నవంబరు 2019 (21:52 IST)

లాంగ్ మార్చ్ లేక టిడిపితో లవ్ మార్చా...!

ఇప్పుడు ఎక్కడ నలుగురు కలిసినా జనసేన లాంగ్ మార్చ్ కూడా చర్చ జరుగుతోంది. ఇసుకేస్తే రాలనంత జనంతో జరిగిన లాంగ్ మార్చ్ ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్న సంతోషంలో ఉన్నారు ఆ పార్టీ నేతలు. ఇసుక కొరతతో ఇబ్బందులు పడుతున్న భవన కార్మికులకు బాసటగా నిలుస్తూ భరోసాను కల్పిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు జనసేన లాంగ్ మార్చ్‌ను ప్రారంభించింది.
 
అశేష జనం మధ్య పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన జనాన్ని చూసిన జనసైనికులు ఆశ్చర్యపోయారు. పవన్‌కు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటున్నారు ఆ పార్టీ నేతలు. అయితే జనసేన పార్టీ నుంచి మాత్రమే పోరాటం చేసి ఉంటే బాగుండేదేమోనన్న ప్రచారం జరిగింది. తరలివచ్చిన జనసందోహం మొత్తం జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులే. 
 
అయితే నిన్న సాయంత్రానికి టిడిపితో పాటు లోక్‌సత్తా మరికొన్ని ప్రజా సంఘాలు పూర్తిస్థాయిలో జనసేనపార్టీకి మద్ధతిచ్చాయి. కార్యక్రమంలో పాల్గొన్నాయి. కానీ మద్దతిచ్చిన నేతలెవరూ పెద్దగా పాల్గొనలేదు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే సభావేదికపై ఉన్నారు. దీంతో లాంగ్ మార్చ్ కాస్త టిడిపితో లవ్ మార్చ్ అంటూ ప్రచారం సాగింది. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌లు కలిసి మరోసారి ముందుకెళ్ళేందుకు లాంగ్ మార్చ్ కాస్త వేదికగా మారిందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.