సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 నవంబరు 2019 (19:42 IST)

పింక్ తెలుగు రీమేక్.. పవర్ స్టార్, నయనతార కలిసి నటిస్తారా? (video)

పింక్ సినిమా తెలుగులోకి రీమేక్ కానుంది. ఈ సినిమా హిందీలో ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాలో అమితాబ్ లాయర్‌గా అదరగొట్టాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్రలో అజిత్ అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ సినిమా రీమేక్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. తెలుగు పింక్‌ను బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తారని తెలుస్తోంది. 
 
ఇక వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈయన గతంలో ఓ మై ఫ్రెండ్, ఎం సి ఏ వంటి చిత్రాలు తెరకెక్కించారు. అది అలా ఉంటే ఈ సినిమాలో పవన్ సరసన ఏ హీరోయిన్ నటించనుందనే అంశంపై చర్చ సాగుతోంది.
 
ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు లేడి సూపర్ స్టార్ నయనతారను ఈ చిత్రంలో పవన్ సరసన నటింప చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. నయన్, పవన్ గతంలో కలిసి నటించక పోవడంతో ఈ జంట కలిసి నటిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం.