గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

లోకేశ్ పనికిరారు.. కేడర్ లేని పవన్‌ను టీడీపీ చీఫ్‌ను చేయాలి : మంత్రి అవంతి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో పడిపోయారని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక కొరతపై పవన్ కళ్యాణ్ ఆదివారం వైజాగ్‌లో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై మంత్రి అవంతి స్పందిస్తూ, టీడీపీ పాలనలో మహిళా ఎమ్మార్వోపై ఓ ఎమ్మెల్యే దాడిచేస్తే స్పందించని పవన్ ఇప్పుడు ఎందుకు రోడ్డెక్కుతున్నాడని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ తెరవెనుక రాజకీయాలు నడిపి, ఇప్పుడు బహిరంగంగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 
 
పవన్ కల్యాణ్ ఇప్పుడు చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్నాడని, పూర్తిగా చంద్రబాబు నియంత్రణలోకి వెళ్లిపోయాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ రాజకీయాలకు పనికిరానందున క్యాడర్ లేని పవన్ కల్యాణ్‌నే టీడీపీ అధ్యక్షుడిగా చేయాలని వ్యంగ్యం ప్రదర్శించారు.