గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2019 (11:50 IST)

మంత్రిగారి అత్యుత్సాహం... రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధం

విశాఖలో వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించటానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా జరిగిన ఆటో ర్యాలీలో స్వయంగా ఏపీ పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ గారే రవాణాశాఖ నిబంధనలను అతిక్రమించారు. 
 
ఆటోలో డ్రైవరుతో సహా నలుగురు మాత్రమే ప్రయాణిచాలి. డ్రైవరు పక్కన ఎవ్వరినీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదు. 
కానీ అవంతీ ఈ‌రెండు నిబంధనలనూ అతిక్రమించారు. 
 
ఆటో‌ డ్రైవరుకు లైట్ కమర్షియల్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. మంత్రిగారికి ఇది ఉండే అవకాశం లేదు.
 అయితే ట్రాఫిక్ పోలీసులు ఆయనను వారించకపోగా సైరన్లు కొడుతూ ఆయన వెంట పగరయాణించటం విశేషం.
 
 ఇటీవలి కాలంలోనే బీజేపీ, టీడీపీలు బైక్ ర్యాలీలు నిర్వహించడానికి ప్రయత్నించినపుడు బైకులు నడిపేవారికి హెల్మెట్లు లేవంటూ ఆ ర్యాలీలని పోలీసులు భగ్నం చేశారు. మరి ఇపుడు ప్రమాదకరమైన ఆటో డ్రైవింగుకు మంత్రిని ఎలా అనుమతించారో ఆ పోలీసులే చెప్పాలి. ఎంతైనా జగన్ సర్కారు కదా.