శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (11:07 IST)

స్నేహితుడితో ఇటుక బట్టీ వద్ద మాట్లాడుతుంటే.. ఆ యువతిని?

ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతున్న ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... స్నేహితుడితో పాటు ఉన్న సమయంలో అతడిపై కామాంధులు దాడికి పాల్పడ్డారు. అనంతరం యువతిపై కర్కశంగా ప్రవర్తించారు. కాలేజీలో ఓ ప్రోగ్రామ్‌ను ముగించుకుని స్నేహితుడిపై వెళ్లిన యువతిపై ఈ అఘాయిత్యం చోటుచేసుకుంది. 
 
స్నేహితుడితో కలిసి సంగంపుంత కాలనీ వద్ద వున్న ఇటుక బట్టీ సమీపంలో మాట్లాడుతుండగా.. వీరిని చూసిన యువకులు.. వారిపై దాడికి పాల్పడ్డారు.  యువతి స్నేహితుడిపై దాడి చేశారు. ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.