గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మార్చి 2020 (08:04 IST)

ఆర్థిక ఇబ్బందులు.. పురుగుల మందు సేవించి టెక్కీ ఫ్యామిలీ...

హైదరాబాద్‌ నగరంలోని హస్తినాపురంలో దారుణం జరిగింది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలకు పురుగుల మందు తాగించి ఆపై వారు కూడా తాగి ప్రాణాలు తీసుకున్నారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రదీప్, స్వాతి అనే దంపతులు ఉన్నారు. ప్రదీప్ ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రదీప్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. వారికి ఇద్దరు కుమారులు.. కళ్యాణ్ ‌(6), జయకృష్ణ (2) ఉన్నారు. ప్రదీప్ కుటుంబం గత కొన్ని నెలలుగా కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. ఆ ఒత్తిడి తట్టుకోలేని ప్రదీప్‌ దంపతులు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నారు. 
 
తాము మరణిస్తే.. తమ కుమారులు అనాథలవుతారని భావించి, వారిని కూడా ఆత్మహత్యలో భాగం చేశారు. నలుగురు ఒకేసారి పురుగుల మందు తాగి, ఆత్మహత్య చేసుకున్నారు. విషయాన్ని గమనించిన ఇంటి యజమాని, విషయాన్ని స్థానికులకు, పోలీసులకు తెలియజేశారు. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పంచనామా నిర్వహించారు. అనంతరం, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం.. మార్చురీకి తరలించారు. ప్రదీప్‌ కుటుంబం ఆత్మహత్య విషయాన్ని వారి కుటుంబీలకు ఫోన్‌ ద్వారా తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.