శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (10:15 IST)

ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి ఇకలేరు...

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ పత్రికా రంగంలో ప్రముఖ పాత్రికేయుడుగా గుర్తింపు పొందిన పొత్తూరి వెంకటేశ్వర రావు ఇకలేరు. అనారోగ్యం కారణంగా ఆయన తన నివాసంలో గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 86 యేళ్లు. 
 
తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు ఈనాడు, ఆంధ్రభూమి, వార్తా పత్రికల్లో పనిచేశారు. పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకుపైగా సేవలు అందించారు. పొత్తూరి 1934 ఫిబ్రవరి 8వ తేదీన ఏపీలోని గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా పనిచేశారు.