డారెన్ సామికి పాకిస్థాన్ పౌరసత్వం.. ఎలా లభించిందంటే?
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామికి పాకిస్థాన్ పౌరసత్వం లభించనుంది. 2017లో ఇతర దేశాల క్రికెటర్లు పాక్ వచ్చేందుకు నిరాకరిస్తున్న సమయంలో డారెన్ పీఎస్‌ఎల్‌లో ఆడాడు. ఆ తర్వాత పాక్‌కు వచ్చే విదేశీ క్రికెటర్ల సంఖ్య పెరిగింది.
ఈ క్రమంలో పాకిస్థాన్ గడ్డపై మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ జరగడం వెనుక సామి చేసిన కృషికి గుర్తింపుగా ఆ దేశపు పౌరసత్వం ఇవ్వనుంది. వచ్చేనెల 23న జరిగే కార్యక్రమంలో తమ ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ గౌరవ పౌరసత్వంతో పాటు పాక్ అత్యున్నత పురస్కారం ‘నిషాన్ ఈహైదర్ ’తో సామిని సత్కరిస్తారని పీసీబీ ప్రకటించింది.
దాంతో వేరే దేశం నుంచి గౌరవ పౌరసత్వం తీసుకుంటున్న మూడో ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా సామి నిలువనున్నాడు. గతంలో సెయింట్ కిట్స్ ప్రభుత్వం మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా), హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా)కు పౌరసత్వం ఇచ్చిన సంగతి తెలిసిందే.