సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 జనవరి 2020 (10:17 IST)

ఇది పౌరసత్వ సవరణ చట్టం కాదు.. బ్రిటీష్ రౌలత్ చట్టం : ఊర్మిళా

బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన "రంగీలా" చిత్రం ద్వారా అగ్ర హీరోయిన్‌గా పేరుగడించింది. ఆ తర్వాత ఆమె వెండితెరకు దూరమైంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు ఇటీవల పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఆందోళనలు సాగుతున్నాయి. 
 
వీటిపై అనేక సెలెబ్రిటీలు తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రౌలత్ చట్టంతో పోల్చారు. ఈ చట్టం చరిత్రలో నల్ల చట్టంగా మిగిలిపోతుందని ఆమె వ్యాఖ్యానించారు. 
 
ముంబై నగరంలో గురువారం గాంధీ వర్థంతి సందర్భంగా జరిగిన ఓ సభలో ఉర్మిలా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. '1919వ సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధం అనంతరం బ్రిటీషు వాళ్లు మన దేశంలో అశాంతిని నెలకొల్పేందుకు రౌలత్ చట్టాన్ని ప్రయోగించారు. అలాగే కేంద్రం రౌలత్ చట్టం లాగే పౌరసత్వ సవరణ చట్టమనే నల్ల చట్టాన్ని తీసుకువచ్చింది' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.