గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (11:14 IST)

అమ్మాయిల పిచ్చి.. సెక్సీగా కనిపించాలని దాని గురించి పట్టించుకోలేదు..

వెస్టిండీస్ పవర్ హిట్టర్ ఆండ్రూ రసెల్ తన మోకాలి గాయం గురించి స్పందించాడు. ఏడేళ్ల క్రితం తనకున్న అమ్మాయిల పిచ్చి, లైంగిక వాంఛతో తన మోకాలి గాయాన్ని పట్టించుకోలేదన్నాడు. ప్రస్తుతం అదే పెద్ద సమస్యగా మారి తనను వేధిస్తుందని ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. తన తరహాలో శరీర సౌష్టవం కావాలనుకునే వారు.. తాను చేసిన తప్పును మాత్రం చేయొద్దు. 
 
తనకు 23-24 ఏళ్ల వయస్సులోనే చిన్నగా మోకాలి నొప్పి వచ్చిందని.. అప్పట్లో దాన్ని తాను పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు. కేవలం భుజం, ఛాతి పెద్దగా కనిపించేందుకు మాత్రమే ఎక్కువగా జిమ్‌లో కష్టపడేవాడినని.. ఆ వయసులో అమ్మాయిలకు సెక్సీగా కనిపించాలనే తాపత్రయం తనలో వుండేదని రసెల్ వ్యాఖ్యానించాడు.
 
సిక్సర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ పవర్ హిట్టర్.. ఎలాంటి బంతినైనా అలవోకగా బౌండరీకి తరలించగలడు. వెస్టిండీస్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం దాదాపు మానేసిన రసెల్ వివిధ దేశాల్లో జరిగే టీ20 లీగ్స్ మాత్రం ఆడుతున్నాడు. కానీ.. మోకాలి గాయం కారణంగా ప్రతి టోర్నీలోనూ అతను ఇబ్బందిపడుతున్నాడు.