శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (12:39 IST)

పండు మిరపకాయలను టీనేజ్ అమ్మాయిలు తీసుకుంటే?

మిరపకాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు వుండవని వైద్యులు చెప్తున్నారు. రోజూ నాలుగేసి మిరపకాయలను వంటల్లో చేర్చుకోవడం ద్వారా గుండె పోటు రాకుండా 40 శాతం వరకు తగ్గించవచ్చని తాజా పరిశోధనలో వెల్లడి అయ్యింది.

మిరపకాయల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గించే ''క్యాప్‌సేసియన్'' అనే పదార్థం ఉంటుందని దీని వల్ల గుండెకు రక్షణ కలుగుతోందని పరిశోధకులు తెలిపారు. భోజనంలో భాగంగా వారానికి నాలుగుసార్లు మిరపకాయలు తింటే గుండెపోటు ముప్పు 40 శాతం తగ్గుతుంది. 
 
అలాగే మహిళలు స్పైసీ పుడ్ తీసుకోవడానికి వాళ్లు ఇష్టపడరు. అయితే మహిళలు ఎండు మిరపకాయ తింటే బరువు తగ్గించుకోవచ్చట. అధిక బరువు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూత్ చాలామందే ఉన్నారు. టీనేజ్ భామలు బరువు విషయంలో ఎక్కువగా భాదపడుతుంటారు. ఇలాంటి వారికి ఎండు మిరపకాయ చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. 
 
పండు మిర‌ప‌కాయ‌ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పండు మిరపకాయలు తినేవారికి గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. దీనిలో ఉండే క్యాప్సెయిసిన్ అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి శరీరంలోని బాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. దీనిద్వారా మనిషి ఆయుష్షు కూడా పెరుగతుందని వైద్యులు చెప్తున్నారు.