గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 5 జనవరి 2020 (17:38 IST)

రాగులతో బరువును నియంత్రించుకోవచ్చు.. తెలుసా?

రాగుల్లో అమినోయాసిడ్స్ వీటిన ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం కలిగి ఉండటం వల్ల రాగులు ఆకలి తగ్గిస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. రాగిపిండితో తయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది. అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.
 
రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలవర్దకమయిన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాగే వయస్సు పెరిగే వారికి కూడా ఇందులోని కాల్షియం బాగా సహాయపడుతుంది. ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.