పొట్లకాయ పురుషులలో ఆ సామర్థ్యాన్ని పెంచుతుందట..!? (Video)
పొట్లకాయతో చేసే వంటలు చాలా రుచిగా ఉంటాయి. ఎలాంటి వ్యాధులు ఉన్నా పొట్లకాయ కూరను మినహాయింపు లేకుండా పెట్టవచ్చు. ఇది తినడం వలన ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. వేడి చేసిన వారికి చలువ చేస్తుంది. ఆయాసం, ఉబ్బసం ఉన్నవారు పొట్లకాయ కూర తింటే ఉపశమనం కలుగుతుంది. లైంగిక వృద్ధికి పొట్లకాయ బాగా దోహదపడుతుంది. పిల్లల కడుపులో నులిపురుగులను పోగొడుతుంది.
సొరకాయ కూడా పురుషుల్లో వీర్యవృద్ధినీ, లైంగిక శక్తిని పెంచుతుంది. సొరకాయ కూరను చాలామంది పథ్యం కూరగా భావిస్తారు. దీనిని తరచుగా తినడం వలన కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది శరీరంలో వేడిని, కఫాన్ని పోగొడుతుంది. అధిక దాహం నుండి విముక్తిని కలిగిస్తుంది. వాంతులు, విరేచనాలు, పేగుపుండుతో బాధపడేవారు సొరకాయను తింటే చాలా మంచిది.
గుండె సంబంధ వ్యాధులన్నింటికి సొరకాయ కూర మంచి ఆహారం. సొరకాయతో పాటు శొంఠి పొడిని గానీ లేదా మిరియాల పొడిని గానీ కలిపి తింటే జలుబు చేయకుండా ఉంటుంది. ముదురు సొరకాయ గింజలను వేయించుకుని, కొంచెం ఉప్పు, ధనియాలు, జీలకర్ర కలిపి నూరి, కొంచెం అన్నంలో కలుపుకుని తింటుంటే పురుషులకు లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.