సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 5 జనవరి 2020 (17:34 IST)

ఎసిడిటీతో బాధపడేవారు టమోటాలను తీసుకోండి..

ఎసిడిటీతో బాధపడేవారు టమోటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది. అలాగే బీపీని తగ్గించే లక్షణాలు టమాటాల్లో పుష్క‌లంగా ఉన్నాయి. డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సమస్యలు ఉండేవారు కూడా టమాటాలు తింటే మంచిది. 
 
ట‌మోటాల‌ను నిత్యం ఆహారంలో తీసుకుంటే.. లివ‌ర్ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని, లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. టమాటా లలో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు ఎక్కువ మోతాదులో ఉంటాయట. చర్మం కోమలంగా, యవ్వనంగా ఉండాలంటే.. టమోటాలు తినాల్సిందే. 
 
ఎందుకంటే వాటిలోని బయోటిన్, విటమిన్ సీ ప్రోటీన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తాయి. అలాగే టమోటాలో సమృద్ధిగా ఉండే ఫైటో న్యూట్రియంట్లు రక్తం గడ్డకట్టకుండా కాపాడతాయి. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.