శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 3 జనవరి 2020 (22:14 IST)

స్లీప్ టానిక్ బాదం మిల్క్... ఎలా చేయాలంటే?

చాలామందికి రాత్రిళ్లు నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు బాదం పాలతో తయారు చేసిన ఈ టానిక్ ఉపయోగిస్తే చాలు. ఇట్టే నిద్రపడుతుంది. దాన్ని ఎలా చేయాలో చూద్దాం.
 
బాదం పాలు తయారీకి నీళ్లలో కప్పు బాదం పప్పులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వాటి తోలు తీసివేసి, బ్లెండర్లో వేసి ముద్దలా చేసుకోవాలి. తర్వాత నాలుగు కప్పుల నీళ్లు, చిటికెడు హిమాలయన్ ఉప్పు చేర్చి తిప్పాలి. దాన్ని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. 
 
ఇలా తయారు చేసుకున్న బాదం పాలు రెండు కప్పులు, నాలుగు ఖర్జూరాలు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ తేనె, అర టీ స్పూను కుంకుమ పువ్వు అవసరమవుతాయి. పాన్‌లో బాదం పాలను వేడి చేసి ఈ పదార్థాలన్నీ కలిపి బ్లెండర్లో వేసి తిప్పాలి. ఆ తర్వాత గ్లాసులో నింపుకుని తాగాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే హాయిగా నిద్రపడుతుంది.