1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. What happens if you use the oil reuse it second time

ఒకసారి వాడిని నూనెను రెండోసారి వాడితే?

oil
అతిగా శుద్ధి చేసిన నూనెలను వాడితే ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు కానీ అలా చేసినవి అంత మేలు చేయవని వైద్యులు చెపుతున్నారు. అలాంటి నూనెలు వాడితే శరీరంలో కణుతులు ఏర్పడే ప్రమాదం వుందని హెచ్చరిస్తున్నారు.
 
కేకులు తయారుచేయడానికి ఎక్కువగా వాడే డాల్డాలో హైడ్రోజనరేటెడ్ కొవ్వు పదార్థాలు వుంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా రక్తనాళాలు మూసుకుపోయేలా చేస్తాయి. ఇతర కొవ్వు పదార్థాలు శారీరక శ్రమ వల్లనో, వ్యాయామం వల్లనో తగ్గే అవకాశం వుంది. కానీ హైడ్రోజనరేటెడ్ ఫ్యాట్స్ మాత్రం ఎంత శ్రమించినా తగ్గవు.
 
ఒకసారి వాడిని నూనెను రెండోసారి వాడితే వచ్చే అనారోగ్య సమస్యలు చాలా తీవ్రంగా వుంటాయి. అల్సర్లు, పైల్స్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు అవకాశం వుంటుంది. 
 
ప్రతి నూనెలోనూ ఓ విశేష అంశం వున్నప్పటికీ అన్ని రకాల నూనెలను వాడటం సాధ్యం కాదు. అందుకని ఉదయం ఓ రకం నూనె, రాత్రికి మరో రకం నూనె వాడితే ఫలితం వుంటుంది. మరో విషయం ఏంటంటే... ఏ నూనెను అయినా తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం శ్రేయస్కరం. 
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
ముఖం మెరిసిపోవాలంటే పుదీనాతో ఇలా పట్టు వేయాలి