సహజసిద్ధమైన నూనెతో అవన్నీ తగ్గిపోతాయ్...
చాలామంది అనారోగ్య సమస్య ఎదురుకాగానే ఇంగ్లీషు మందులు వాడుతారు. ఐతే సహజసిద్ధమైన కొన్ని ఉత్పత్తులను వాడితే సమస్యలను అధిగమించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
1. జ్వరంతో బాధపడేవారికి చల్లటి నీళ్లలో ఆరు నుంచి పది చుక్కల నీలగిరితైలం వేసి శరీరాన్ని శుభ్రపరిస్తే త్వరగా జ్వరం తగ్గుతుంది.
2. కప్పు నీళ్లలో ఆరుచుక్కల నీలగిరితైలం కలిపి పుక్కిలిస్తే నోటిపూత, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు బాధించవు.
3. జలుబు, దగ్గు, సైనస్ వల్ల వచ్చే తలనొప్పితో బాధపడుతున్నట్లైతే చేతిలో నాలుగు చుక్కలు నీలగిరి తైలం వేసి పీల్చితే ఉపశమనం లభిస్తుంది.
4. చిన్నపిల్లలకు కఫం పెరిగి గురక పెడుతుంటే ఆరు నుంచి పది చుక్కలు నీళ్లలో వేసి పీల్చేలా చూడాలి.
5. ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నవారు నీళ్లలో రెండు మూడు చుక్కలు కలిపి తాగిస్తే మంచిది.
6. కండరాల నొప్పి, నరాలు పట్టుకుపోయినప్పుడు కొబ్బరి నూనెలో కొద్దిగా తైలం కలిపి పై పూతగా రాస్తే సమస్యదూరమై హాయిగా ఉంటుంది.