శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2019 (17:17 IST)

భోజనం వేగంగా చేస్తే బరువు పెరుగుతారా? (video)

ఉరుకుపరుగుల జీవతపయనంలో నెమ్మదిగా భోజనం చేసేందుకు కూడా సమయంలేదు. దీంతో అనేక మంది అమిత వేగంతో భోజనం పూర్తిచేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పలు దుష్ప్రరిణామాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఎవరైనా సరే భోజనం వేగంగా చేయకూడదని సలహా ఇస్తున్నారు. చాలా నెమ్మదిగా తినాలి. అయితే వేగంగా భోజనం చేయడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఇపుడు తెలుసుకుందాం. 
 
* వేగంగా భోజనం చేయడం వల్ల ఆహారం ఎక్కువగా తింటారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంతో అధికంగా బరువు కూడా పెరుగుతారట. అందుకని నెమ్మదిగా భోజనం చేయాలని పరిశోధకులు చెబుతున్నారు.
 
* వేగంగా భోజనం చేయడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదట. సాధారణంగా ఆహారం జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో క్రమంగా జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా అజీర్ణ సమస్య వస్తుంది.
 
* వేగంగా భోజనం చేస్తే ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్ 2 డయాబెటిస్ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
 
* చాలా త్వరగా ఆహారం తినడం ముగించేస్తే గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా వస్తాయి. కనుక ఆహారాన్ని నెమ్మదిగా నమిలి మింగాలని వైద్యులు చెబుతున్నారు.