హీరోయిన్ గదిలో ఆ హీరో... అతని కారణంగానే అంజలి కెరీర్ నాశనమా?
తెలుగు చిత్ర పరిశ్రమలో అచ్చ తెలుగు హీరోయిన్ అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో మంచిపాపులర్ అయింది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించింది. అదేసమయంలో తమిళ యువ హీరో జైతో కలిసి జర్నీ చిత్రంలో నటించింది. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ చిత్రం షూటింగ్ సమయంలోనే అజంలి - జైల మధ్య ప్రేమాయణం కొనసాగింది. ఆ తర్వాత 'బెలూన్' అనే సినిమాలో నటించారు.
ఈ చిత్ర నిర్మాత నందకుమార్ వీరిద్దరి గురించి సంచలన విషయాలను వెల్లడించారు. అంజలి చాలా మంచి అమ్మాయని, కానీ ఆమె జీవితంలోకి హీరో జై వచ్చిన తర్వాత ట్రాక్ మారిపోయిందని ఆయన తెలిపాడు. బెలూన్ చిత్రం షూటింగ్ నిమిత్తం కొడైకెనాల్‌లో హీరో, హీరోయిన్లకు వేర్వేరు రూమ్స్ బుక్స్ చేశాం. కానీ వారిద్దరూ ఓకే రూమ్‌లో ఉండేవారు. మరో రూమ్ క్యాన్సిల్ చేద్దామంటే జై ఒప్పుకునేవాడు కాడని, దాంతో ఆ రూమ్‌కి రోజుకు రూ.12 వేలు అద్దె చెల్లించినట్టు చెప్పారు.
పైగా, షూటింగ్‌లో అంజలిని పేరు పెట్టి పిలిస్తే జై గొడవపడేవాడని, మేడమ్ అని పిలవాలని లేకుంటే షూటింగ్ ఆపేస్తానని బెదిరించేవాడని చెప్పుకొచ్చాడు. ఒకరోజు అంజలి షూటింగ్‌కి రాలేదు. మేం ఆమెకు చాలా సార్లు ఫోన్ చేసినా తీయలేదు. చివరకు ఆమె ఫోన్ చేసి కడుపు నొప్పిగా ఉందని చెప్పింది. మేం ఆమె రూముకు కారుని కూడా పంపాం. కానీ జై, అంజలి అదే కారులోనే ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడ నుండి చెన్నై వెళ్లిపోయారు. మా షూటింగ్ ఆగిపోయింది. జై ప్రవర్తన కారణంగా తను చాలా నష్టపోయానని నిర్మాత నందకుమార్ తెలిపాడు.