శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2019 (13:01 IST)

చుడీదార్‌లో స్టైల్‌గా ఫోటోకు ఫోజిచ్చిన శశికళ.. వైరల్

బెంగళూరు జైలులో కారాగార శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా తేలడంతో నాలుగేళ్ల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. దీంతో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ చుడీదార్‌లో ఫోటోకు ఫోజిచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తుంది. 
 
ఆమె ప్రవర్తన కారణంగా శశికళను ముందుగానే విడుదల చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. కానీ కర్ణాటక జైలు శాఖాధికారి మెక్రీత్.. బెంగళూరు జైలులో వున్న శశికళకు ప్రవర్తనా నియమావళి వర్తించదు. ఆమెకు కోర్టు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవించే తీరాలని.. ఆ తర్వాతే శశికళను విడుదల చేస్తారని ప్రకటించారు. 
 
ఇటీవల శశికళ జైలులో వుంటూ షాపింగ్‌కు వెళ్లడం.. జైలులో ప్రత్యేకంగా వంట చేసుకుని తినడం, ఐదు సెల్ ఫోన్లు ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం చుడీదార్‌లో అలా జైలులో ఫోజివ్వడం వంటివి ప్రవర్తనా నియమావళిని అతిక్రమించినట్లేనని అధికారులు చెప్తున్నారు. ఈ ఫోటో ఎలా లీకైంది..? ఈ ఫోటోను తీసిన వారెవరు? అనే అంశాలపై చర్చ సాగుతోంది.