సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (16:24 IST)

పాలను మళ్లీ మళ్లీ వేడి చేస్తున్నారా?

దేశంలోని పట్టణ ప్రాంతాల్లో పాలు ప్యాకెట్లలో లభ్యమవుతాయి. అదే గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతుల నుంచి పాలను కొని తెచ్చుకుంటారు. ఇలాంటి పాలను ఒకసారి కాస్తారు. అవి చల్లారిన తర్వాత మళ్లీ మళ్లీ కాస్తుంటారు. దీనివల్ల మంచి కంటే హాని జరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఇండియన్ మెడికల్ అకాడెమీ వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో... ఒకసారి కాచిన పాలను అవసరమైనప్పుడల్లా తిరిగి మళ్లీ అధిక ఉష్ణోగ్రతలో కాచి వాడుతున్నట్టు తేలింది. అంటే 25-40 ఏళ్ల మధ్య వయసున్న 300 మంది మహిళలను అధ్యయనంలో భాగంగా ప్రశ్నించారు. 39 శాతం మంది పాలను మూడు కంటే ఎక్కువ సార్లు కాచి వాడుతున్నట్టు వెల్లడించారు.
 
62 శాతం మంది ఐదు నిమిషాల కంటే అధిక సమయం పాటు పాలను కాస్తున్నారట. 72 శాతం మంది పాలను కాస్తున్నప్పుడు గరిటెతో తిప్పడం లేదని తేలింది. 'అధిక ఉష్ణోగ్రత వద్ద పాలను మళ్లీ మళ్లీ కాచడం వల్ల ముఖ్యంగా బీ గ్రూపు విటమిన్లు ఆవిరైపోతాయి. అందుకే పాలను రెండు సార్లకు మించి కాకుండా ప్రతీ సారి రెండు మూడు నిమిషాలకు మించకుండా కాచుకోవాలి' అని ఈ అధ్యయనంపై పాల్గొన్న పరిశోధకులు సలహా ఇస్తున్నారు. వీలైతే ఒకసారి కాచిన పాలనే తాగడం మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు.