రెండు కోడిగుడ్ల ధర రూ.1700.. బిల్లు చూసి కనిగుడ్లు తేలేసిన కస్టమర్

four seasons hotel bill
Last Updated: మంగళవారం, 13 ఆగస్టు 2019 (12:06 IST)
గతంలో రెండు అరటిపండ్లకు రూ.443 వసూలు చేసింది చంఢీగఢ్‌లోని మారియట్ హోటల్. అపుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సదరు హోటల్ యాజమాన్యానికి వాణిజ్య పన్నుల విభాగం రూ.25 వేల అపరాధం విధించి కూడా. జీఎస్టీ పరిధిలోకి రాని అరటి పండ్లకు కూడా జీఎస్టీ విధించడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటన బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌కు ఎదురైంది.

ఇపుడు అలాంటి సంఘటనే ప్రముఖ రచయిత కార్తీక్ దార్‌కు ఎదురైంది. ఈయన ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ రెండు బాయిల్డ్ ఎగ్‌లకు ఆర్డర్ ఇచ్చారు. వీటికి రూ.1700 చార్జి చేశారు. అలాగే, ఒక ఆమ్లేట్‌కు రూ.850 వసూలు చేశారు. అలాగే, రెండు ఎగ్ ఆమ్లేట్స్‌కు కూడా రూ.1700 బిల్లు వేశారు. ఈ బిల్లు చూసిన కార్తీక్ దార్‌కు కళ్లు బైర్లు కమ్మాయి.

ఇక వెంటనే రాహుల్‌ బోస్‌ను ట్యాగ్‌ చేస్తూ.. 'నిరసన వ్యక్తం చేద్దామా భాయ్‌..!' అని క్యాప్షన్‌ పెట్టాడు. ఈ వ్యవహారంపై హోటల్‌ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. ఇక ఈ ట్వీట్‌పై ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. 'గుడ్డుతో పాటు బంగారం కూడా ఇచ్చారా' అని ఒకరు.. 'చికెన్‌ తినాలంటే సంపన్న కుటుంబంలో మాత్రమే జన్మించాలా' అని మరొకరు కామెంట్‌ చేశారు.దీనిపై మరింత చదవండి :