శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : ఆదివారం, 11 ఆగస్టు 2019 (17:54 IST)

పాకిస్థాన్ మహిళకు కౌంటరిచ్చిన ప్రియాంక చోప్రా.. అరవడం వల్ల ఉపయోగం లేదంటూ?

కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో భారత విమానాలకు గగనతలాన్ని పాక్ మూసివేసిందంటూ వస్తున్న ఆరోపణలను ఆ దేశం ఖండించిన సంగతి తెలిసిందే. అలాగే కాశ్మీర్ సమస్యతో ప్రస్తుతం భారత్-పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు క్షీణించాయి.


ఈ సెగ ప్రస్తుతం సినిమా వాళ్లను కూడా తాకింది. ఇప్పటికే పాకిస్థాన్‌లో భారత సినిమాలపై నిషేధం విధించాలనే డిమాండ్ పెరిగింది. అలాగే భారత్ నుంచి వచ్చే వస్తువులను కూడా దిగుమతి చేసుకోకూడదని పాకిస్థాన్ నిర్ణయించుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఓ పాకీస్తానీ మహిళ అడిగిన ప్రశ్నకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్, హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా అదిరిపోయే సమాధానం ఇచ్చింది. గ్లోబల్ స్టార్  ప్రియాంక చోప్రా లాస్‌ఏంజెల్స్‌లో తాజాగా బ్యూటీకాన్‌ అనే ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొంది. ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరైన  ప్రియాంక చోప్రా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. 
 
ఈ సందర్బంలో ఓ పాకిస్తానీ యువతి ప్రియాంకతో దురుసుగా మాట్లాడుతూ.. యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌ అయివుండి.. మీరు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఎయిర్‌ స్ట్రయిక్స్‌ చేసినప్పుడు ‘జై హింద్‌’ అంటూ రెచ్చగొట్టే విధంగా ట్వీట్ చేయొచ్చా? అంటూ అరుస్తూ ప్రశ్నించింది. 
 
పాకిస్థాన్‌లో తనకు ఎంతోమంది స్నేహితులు వున్నారు. ''నేను ఇండియన్.. నా దేశం పట్ల నాకు గౌరవం ఉంటుంది. అయితే నేను రెచ్చకొట్టేలా మాట్లాడలేదు. నువ్వు నీ దేశం కోసం ఎలా ప్రశ్నిస్తావో.. నేను నాదేశం తరపున అలాగే ఉంటాను. ఇలా మీరు సందర్బం లేకుండా అరవడం వలన ఎవరికీ ఉపయోగం లేదు.. అందరిలోనూ పరువు పోగొట్టుకోవడం తప్ప" అని గట్టిగా సమాధానం ఇచ్చింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.