మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (18:42 IST)

షాహిల్‌తో విడిపోవడానికి మూడో వ్యక్తి కారణం కాదు.. సారీ కనికా... దియా మీర్జా (video)

బిటౌన్‌లో దియా మీర్జా తన భర్త షాహిల్‌తో తెగతెంపులు చేసుకోవడంపై పెద్ద రచ్చే జరుగుతోంది. కానీ దియా మీర్జా, షాహిల్‌లు విడిపోయేందుకు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కోడలు కారణమని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలను కనిక ట్విట్టర్ ద్వారా తీవ్రంగా ఖండించింది. తన పని తాను చేసుకుపోతున్నానని.. దియా మీర్జాను, షాహిల్‌ను తాను కలిసిందే లేదని క్లారిటీ ఇచ్చేసింది. 
 
ఈ నేపథ్యంలో దియా మీర్జా తన భర్త నుంచి విడిపోవడంపై మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించింది. తన భర్తతో తాను విడిపోయేందుకు మూడో వ్యక్తి కారణం కాదని తేల్చేసింది. మీడియా వేలెత్తి చూపుతున్న బాలీవుడ్ స్క్రీన్‌రైటర్ కనిక ధిల్లాన్ కారణమని వస్తున్న వార్తలను దియా మీర్జా కనిక పేరు చెప్పకుండానే కొట్టిపారేసింది. 
 
ఈ వ్యవహారంపై దియా మీర్జా ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేసింది. షాహిల్‌తో తాను విడిపోవడంపై మీడియా విభాగం ఊహాగానాలను ప్రచురిస్తుందని.. ఇది బాధ్యతారహితమని ఆవేదన వ్యక్తం చేసింది. మీడియా ఇలా వదంతులను ప్రచారం చేయడం చాలా దురదృష్టకరమని వాపోయింది. 
ఇంకా దురదృష్టకరం ఏమిటంటే? తన భర్తతో తాను విడిపోవడంలో తమ సహోద్యోగులకు సంబంధాలున్నట్లు వారి పేర్లను బయటికి తేవడం.. తద్వారా వారికి అపకీర్తి తేవడమేనని ఫైర్ అయ్యింది. మీడియా ద్వారా సహచరులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అబద్ధాన్ని నిజం చేయడానికి.. మరొక మహిళ పేరును తెరపైకి తేవడం బాధ్యతారహితం కాదా అంటూ ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆమె కనికా థిల్లాన్‌కు క్షమాపణ తెలిపింది. 
 
షాహిల్ తాను విడిపోవడానికి మూడో వ్యక్తి కారణం కాదని దియా మీర్జా పునరుద్ఘాటించింది. ఇందులో మీడియా చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ప్రశాంతత కావాలని, ప్రైవసీ కావాలని.. తమ ఆత్మగౌరవానికి ఇకనైనా మీడియా భంగం కలిగించదని ఆశిస్తున్నానని దియా మీర్జా చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే.. దియా మీర్జా గురువారం తాను షాహిల్‌తో 11 సంవత్సరాల వైవాహిక సంబంధానికి ముగింపు పలుకుతున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ''తాము స్నేహితులుగా వున్నామని, ప్రేమ, గౌరవంతోనే ఒకరికొకరు దూరమవుతున్నట్లు చెప్పింది. తమ ప్రయాణాలు మమ్మల్ని వేర్వేరు మార్గాల్లో నడిపించగలిగినప్పటికీ.. తాము ఒకరితో ఒకరు పంచుకునే బంధానికి ఎప్పటికీ కృతజ్ఞులమని'' షాహిల్ రాసుకొచ్చాడు.