యువతుల్ని అలా వాడుకున్న పాక్ క్రికెటర్ ఇమామ్..

Last Updated: గురువారం, 25 జులై 2019 (18:52 IST)
పాకిస్థాన్ ప్ర‌ముఖ క్రికెట‌ర్‌, ఓపెన‌ర్ ఇమామ్ ఉల్ హ‌క్ వివాదంలో చిక్కుకున్నాడు. తన స్టార్ డమ్‌ను ఉపయోగించి అనేకమంది యువతుల్ని ఇమామ్ ఉల్ హక్ మోసం చేశాడని.. పాకిస్థాన్ మీడియా కోడైకూస్తోంది. ఇంకా ప‌లువురు యువ‌తులతో ఇమామ్ ఉల్ హక్ ఛాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 
 
ప్రేమ పేరుతో లోబరుచుకిని.. వారితో శారీరకం సంబంధాలకు పెట్టుకున్న ఇమామ్.. ఆపై ముఖం చాటేసేవాడని తెలిసింది. ప్రపంచ‌క‌ప్ స‌మ‌యంలోనూ కొన‌సాగించాడ‌ని పాక్ మీడియా పేర్కొంది. ప్రపంచకప్‌లో ఇమామ్‌ పేలవ ప్రదర్శనకు కూడా ఇదే కారణమని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది.

కాగా ఇమామ్‌పై తీవ్ర విమర్శలు గుప్పుమంటున్న వేళ ఇటు ఇమామ్‌గాని, అటు పాక్ బోర్డు కాని ఈ వివాదంపై ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు.దీనిపై మరింత చదవండి :