సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 17 జులై 2019 (11:16 IST)

పెళ్లికాని అమ్మాయిలు ఫోన్ వాడారో.. ఇక అంతే సంగతులు..

పెళ్లికాని అమ్మాయిలు ఇక ఫోన్ వాడితే అంతే సంగతులు.. ఈ విచిత్రమైన నిర్ణయాన్ని గుజరాత్‌లోని ఓ గ్రామ పంచాయతీ తీసుకుంది. గుజరాత్‌లోని బాణస్కాంత గ్రామంలోని పెద్దలో సెల్‌ఫోన్‌కు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెళ్లికాని అమ్మాయిలు మొబైల్ ఫోన్లను వాడితే.. అతని తండ్రి నుంచి లక్షన్నర రూపాయలు జరిమానాగా వసూలు చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు.
 
ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఫోనే వాడితే, ఆమె తండ్రి నుంచి రూ. 1.50 లక్షలు జరిమానాగా వసూలు చేయాలని పెద్దలు నిర్ణయించారు. దీంతోపాటు... గ్రామ పెద్దలు కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వివాహ సమయాల్లో డీజేలు వద్దని, బాణసంచా కాల్చడాన్ని ఆపివేయాలని నిర్ణయించారు. 
 
ఏ అమ్మాయి అయినా వారి పెద్దల అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంటే అది నేరంగానే పరిగణించాలని తీర్మానించారు. అయితే గ్రామ పెద్దలకొన్ని నిర్ణయాలు మంచిగానే ఉన్నా.. ఫోన్ వాడకం విషయంలో తీసుకున్న నిర్ణయం మాత్రం సరికాదనే వాదన మొదలైంది. సమాజంలో చోటుచేసుకునే నేరాలు స్మార్ట్ ఫోన్ల వల్లే పెరిగాయని ఈ గ్రామ పెద్దలు అంటున్నారు. అందుకే పెళ్లికి ముందు యువతులు సెల్‌ఫోన్లను వాడకూడదని షరతు పెట్టినట్లు గ్రామ పెద్దలు చెప్తున్నారు. నేరాలను తగ్గించేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.