శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 26 జులై 2019 (16:31 IST)

ఇపుడిపుడే అన్నీ చక్కబడుతున్నాయ్ : కంగనా రనౌత్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌తో పాటు.. 65 మంది సెలెబ్రిటీలు ఓ బహిరంగ లేఖ రాశారు. దేశంలో విద్వేష దాడులు, మూక దాడులు, హత్యలు గణనీయంగా పెరిగాయి. మూకదాడులపై చర్యలు తీసుకోవడంలో సర్కారు మూగపాత్ర వహించడం, ఈ విషయాన్ని అలక్ష్యం చేయడం మమ్మల్ని బాధిస్తున్నది అని 62 మంది సెల‌బ్రిటీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ బహిరంగ లేఖ రాశారు. వారి వాద‌న‌ని ప‌లువురు ఏకీభ‌విస్తుండ‌గా, ప‌లువురు వ్య‌తిరేఖిస్తున్నారు. 
 
కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే కంగనా తాజాగా ఈ వివాదంపై స్పందించింది. కొంత మంది ప్ర‌ముఖులు త‌మ ప‌వ‌ర్‌ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో అన్ని ప‌రిస్థితులు దారి త‌ప్పుతున్నాయి అని చెబుతున్నారు. కాని ఈ దేశంలో మొదటిసారి అన్ని సరైన దిశలో వెళుతున్నాయి అని కంగ‌నా పేర్కొంది. 
 
మార్పులో మేము భాగంగా ఉన్నాము. దేశంలో ఇప్పుడిప్పుడే మంచి ప‌రిస్థితులు వ‌స్తున్నాయి. వీటిని చూసి కొంద‌రు క‌ల‌త చెందుతున్నారు. సామాన్య ప్ర‌జ‌లు త‌మ నాయ‌కుల‌ని ప్రజాస్వామ్య‌బ‌ద్ధంగా ఎన్నుకున్నారు, కానీవారిని కొంద‌రు త‌ప్పుప‌ట్ట‌డం బాధ‌గా ఉందంటూ కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది.
 
ఈ లేఖ రాసిన వారిలో క్లాసికల్ డ్యాన్సర్, ఎంపీ సోనాల్ మాన్‌సింగ్, ఇన్‌స్ట్రుమెంటలిస్ట్ పండిట్ విశ్వ మోహన్ భట్, ఫిల్మ్ మేకర్ మధూర్ భండాకర్, వివేక్ అగ్నిహోత్రి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌తో సహా మత్తం 62 మంది వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలు ఉన్నారు.