మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 23 జూన్ 2019 (13:32 IST)

ట్రంప్ ఓ కామాంధుడు... అత్యాచారం చేశాడంటూ రచయిత్రి ఆరోపణ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ కామాంధుడని ఓ మహిళ ఆరోపిస్తుంది. ఆయన తనపై అత్యాచారం చేశాడంటూ ప్రముఖ మహిళా రచయిత్రి ఈజాన్ క్యారెల్ ఆరోపించింది. అయితే, 23 యేళ్ళ క్రితం ఈ సంఘటన జరిగింది. ఈ విషయాన్ని ఈజాన్ క్యారెల్ తన 'హిడియస్‌ మెన్' అనే ఆత్మకథలో వివరించారు. తనను బలవంతంగా వశపరచుకుని కామవాంఛ తీర్చుకున్నారని ఆరోపించారు. 
 
ఒక బట్టల దుకాణం ట్రయల్‌ రూమ్‌లో ఆయన తనపై అఘాయిత్యానికి ఒడిగట్టారని చెప్పారు. ఇప్పటివరకు ట్రంప్‌ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు 16 మంది మహిళలు ఆరోపించారు. అందులో ట్రంప్‌ మాజీ భార్య ఇవానా కూడా ఉన్నారు. క్యారెల్‌ ఆత్మకథలోని అంశాలను తొలుత న్యూయార్క్‌ అనే మేగజీన్‌ ప్రచురించింది. ఆ తర్వాత ఆమె వాషింగ్టన్‌ పోస్ట్‌ తదితర పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పట్లో ఆమె ఒక టీవీ చానెల్లో మహిళలకు సలహాలిస్తూ షో నిర్వహిస్తున్నారు. 
 
ఈజాన్‌ కరోల్‌ ఆరోపణలపై డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. తన జీవితంలో ఆమెను ఎప్పుడూ కలవలేదని అన్నారు. తాను రాసిన రచనల అమ్మకాలను పెంచుకోవడానికి ఓ కట్టు కథ అల్లి వదిలిందని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు పరిశీలించకుండా 'న్యూయార్క్‌ మ్యాగజైన్‌' ఇటువంటి కథనాన్ని ఎలా ప్రచురిస్తుందని ప్రశ్నించారు. అటువంటి స్టోర్‌‌లో కెమెరాలు ఉండవా? అని అడిగారు. అమ్మకాలు జరిపించేందుకు సహాయకులు ఉంటారని, అసలు డ్రెస్సింగ్‌ రూమ్‌‌లో రేప్ చేయడం ఎలా సాధ్యమని ట్రంప్ ప్రశ్నించారు. డొనాల్డ్ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇప్పటివరకూ దాదాపు 20 మంది మహిళలు ఆయనపై అత్యాచార అరోపణలు చేసిన సంగతి తెలిసిందే.