అసెంబ్లీని ఓ పందులదొడ్డిలా మార్చిన బాబుకు సరైన గుణపాఠం : చిన్నకృష్ణ
2019 ఎన్నికల్లో తెలుగు అంటే ఇష్టపడి, మాట్లాడి, పుట్టి, అభిమానించి జగన్ మోహన్ రెడ్డిని అత్యంత మెజారిటీతో గెలిపించడానికి ఓటేసిన ప్రతి ఒక్కరికీ ఆ పార్టీ సభ్యుడిగా చిన్నకృష్ణ అభినందనలు తెలుపుతున్నా. మూడు సంవత్సరాలుగా ఏ మాటైతే చెప్పాను.. రెండు సంవత్సరాల క్రితం ఏ మాటైతే చెప్పాను.. సంవత్సరం క్రితం తెలంగాణ నుంచి మహాకూటమి సర్వనాశనం అయిపోతుందని చెప్పానో, తెలుగుదేశం పార్టీ పుట్టగతులు లేకుండా పోతుందని చెప్పానో దాన్ని అక్షర సత్యంగా నిలబెట్టిన ఓటరు మహాశయులందరికీ శుభాక్షాంక్షలు తెలుపుతున్నాను.
ఈ మొత్తం క్రెడిట్ మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది. ఎందుకంటే భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో 29 పాలక పక్షాలు, ప్రతిపక్షాలున్నాయి. ఏ ప్రతిపక్ష నాయకుడు ఇంత పెర్ఫామెన్స్ ప్రపంచంలో ఎక్కడా చేయలేదు. రాత్రింబగళ్లు కుటుంబానికి దూరంగా, ప్రజల్లోనే మమేకమవుతూ, ప్రతి నియోజకవర్గంలోని సమస్యను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.
అసెంబ్లీని ఓ పందులదొడ్డిలా మార్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన రోజునే మా నాయకుడి సక్సెస్ స్టార్ట్ అయిపోయింది. చాలా క్లారిటీ ఉన్న జగన్ మోహన్ రెడ్డి కష్టప్రతిఫలమే ఇది అని.. మనస్ఫూర్తిగా చెబుతున్నాను. 2024లో కూడా ఇంత కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తుందని ఓ రైటర్‌గా నిస్సందేహంగా చెబుతున్నాను. వై.ఎస్ జగన్‌కు, వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.