బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2019 (20:00 IST)

వివాహ బంధానికి ఫుల్‌స్టాఫ్ పెట్టనున్న దియామిర్జా

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన మరో జంట తమ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాఫ్ పెట్టనుంది. ఆ జంట ఎవరో కాదు దియా మిర్జా, సాహిల్ సంఘా. వీరిద్దరూ త్వరలోనే విడిపోనున్నారు. ఈ విషయాన్ని దియా మిర్జా స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. బాలీవుడ్ హీరోయిన్ అయిన దియా మిర్జా గత 2014లో ప్రముఖ వ్యాపారవేత్త సాహిల్ సంఘాను పెళ్లి చేసుకుంది. అయితే, వీరి వైవాహిక బంధం ఐదేళ్లు పూర్తికాకముందే విడిపోవాలని నిర్ణయించుకోవడం గమనార్హం. 
 
ఇదే అంశంపై దియా మిర్జా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. "మేమిద్దరం గత పదకొండేళ్లుగా కలిసున్నాం. ఒకరి కష్టసుఖాలను మరొకరం పంచుకున్నాం. ఇప్పుడు విడిపోయాలని నిర్ణయించుకున్నాం. మా ప్రయాణాలు విభిన్న మార్గాలను ఎంచుకున్నాయి. విడిపోయినా మేం ఎప్పటిలా స్నేహితులుగానే ఉంటాం. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు మా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మీడియాకు ధన్యవాదాలు. ఈ సమయంలో మాకు కాస్త ప్రైవసీని కల్పిస్తారని శిస్తున్నాం. ఇక, ఈ విషయం గురించి నేను ఎలాంటి కామెంట్లు చేయదలచుకోలేదు. ధన్యవాదాలు" అంటూ దియా మిర్జా తన ట్వీట్‌లో పేర్కొంది.