శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (15:31 IST)

ఆకలిని కాస్త చంపుకుని.. తేలికపాటి ఉపవాసాలతో ఒబిసిటీ తగ్గించుకోవచ్చు...

ఎక్కవ గంటల పాటు ఉపవాసం చేయలేకపోయినా, అడపాదడపా ఆకలిని చంపుకుంటూ తేలికపాటి ఉపవాసాలు చేస్తూ కూడా అధిక బరువు తగ్గించుకోవచ్చు. 
 
వ్యాయామం: వ్యాయామం అలవాటున్న వారికి ఆకలి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే వ్యాయామం తదనంతరం పెరిగే ఆకలిని వెంటనే తీర్చేసుకోకుండా, కొంత ఆలస్యం చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మెటబాలిజం వేగవంతమవుతుంది.
 
నీళ్ళు తాగాలి: ఆకలిని దూరం పెట్టాలన్నా, అలాగే జిహ్వచాపల్యాన్ని అదుపులో ఉంచాలన్నా నీళ్ళ మీదే ఆధారపడాలి. కాబట్టి ఉపవాసం ఉండాలనుకునే వాళ్ళు తరుచుగా నీళ్లు తాగుతూ ఉండాలి.
 
బ్లాక్ కాఫీ: చక్కెర, పాలు కలిసిన కాఫీ మీద మీకు మక్కువ ఉన్నా, ఉపవాసం చేసే సమయంలో కేవలం బ్లాక్ కాఫీనే తాగాలి. మరీ ముఖ్యంగా ఉపవాసాన్ని బ్లాక్ కాఫీతో మొదలు పెడితే ఆకలి అదుపులో ఉంటుంది.
 
ఉప్పు: భరించలేని ఆకలి వేస్తే, మణికట్టు మీద ఉప్పు చల్లుకుని నాకాలి. ఇలా చేయడం వల్ల ఆకలి దూరమవడంతోపాటు, తినాలనే కోరిక తగ్గుతుంది.