శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 15 జులై 2019 (13:51 IST)

గొంతులో కిచ్ కిచ్‌గా వుందా..? ఐతే ఇలా చేయండి..

గొంతులో కిచ్ కిచ్‌గా వుందా.. అయితే ఇలా చేయండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. గొంతులో ఇబ్బందిగా వుంటే.. ఒక టేబుల్‌స్పూన్‌ తేనె తీసుకోవాలి. ప్రతీ మూడు గంటలకొకసారి తీసుకుంటూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు త్వరగా నయం అవుతాయి. అలాగే రోజూ క్రమంతప్పకుండా దాల్చిన చెక్కపొడిని తేనెతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
 
బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది. దాల్చిన చెక్క పొడి చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. తేనె, దాల్చినచెక్క పొడిని సమానంగా తీసుకుని సమస్య ఉన్న చోట పూస్తే ఎగ్జిమా, రింగ్‌వార్మ్స్‌, ఇతర స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.
 
ఇంకా మూడు టేబుల్‌స్పూన్ల తేనె, ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని పేస్టు మాదిరిగా చేసుకుని పడుకునే ముందు ముఖానికి పట్టించాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తే మొటిమలు మొత్తం మటుమాయమవుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి దాల్చిన చెక్క పొడి దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ కంటే అరగంట ముందు పరగడుపున కప్పు నీటిలో తేనె, దాల్చిన చెక్కపొడి వేసుకుని మరిగించి తాగాలి. రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.