సోషల్ మీడియాలో కుమార్తె న్యూడ్ ఫోటోల వైరల్.. తండ్రి ఏం చేశాడంటే...
కన్నబిడ్డ న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో కావడంతో కన్నతండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసిన మృతుని సోదరుడు గుండె ఆగిపోవడంతో ప్రాణాలు విడిచాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లా కౌలా అనే గ్రామంలో జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ యువతికి, అదే గ్రామానికి చెందిన మరో యువకుడికి మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం సాగుతూ వచ్చినట్టు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది.
ఈ క్రమంలో యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో, కేసు పెట్టిన పోలీసులు, యువకుడి కుటుంబంలోని ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపారు. వారంతా ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. వీరంతా యువతి తల్లిదండ్రులపై పగ పెంచుకున్నారు.
దీనికి ప్రతీకారంగా ఆ యువతితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను గ్రామంలోని గ్రూప్‌లలో, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఈ విషయం బాధిత యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారంతా తీవ్ర మనస్తాపం చెందారు.
ఈ నేపథ్యంలో ఆ యువతి తండ్రి అవమాన భారాన్ని భరించలేక గ్రామం సమీపంలోని అడవిలో ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. తన సోదరుని మరణ వార్తను విన్న ఆయన తమ్ముడు గుండెపోటుకు గురై ప్రాణాలొదిలాడు. ఇద్దరి మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.