శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 13 జులై 2019 (12:44 IST)

పాప్‌కార్న్ తింటే నాజూకైన నడుము.. ఎముకలకు బలం

పాప్ కార్న్ తింటే నాజూకైన నడుమును పొందవచ్చునని.. న్యూట్రీషియన్లు అంటున్నారు. పాప్‌కార్న్‌లో ఎక్కువగా పీచుపదార్థాలూ, యాంటీ ఆక్సిడెంట్లూ ఉంటాయి. కొవ్వుపదార్థాలు తక్కువ మోతాదులో లభిస్తాయి. పైగా వీటిని ఎక్కువరోజలు నిల్వ ఉండేలా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకొవచ్చు. అందుకే వీటిని కొన్ని ప్యాక్‌చేసుకుని కాలేజీకో, ఆఫీసుకో స్నాక్స్‌లా తీసుకెళ్లగలిగితే మేలు. నడుము భాగంలో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది.
 
అలాగే పాప్‌కార్న్ వయస్సు పెరగడం వల్ల వచ్చే ముడుతలను, వయసు మచ్చలను తొలగిస్తుంది. పాప్ కార్న్‌లో అధిక మోతాదులో మాంగనీస్ ఉంది, ఇది బలమైన ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మించి, అదే స్థాయిలో వాటి దృఢత్వాన్ని కొనసాగేలా ఉంచడానికి సహాయపడుతుంది. మాంగనీస్ అనేది ఎముకల నిర్మాణానికి సహాయపడుతుంది. తద్వారా ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను దూరం చేస్తుందని.. వైద్యులు అంటున్నారు.